![]() |
![]() |
.webp)
ఎప్పుడో 15 ఏళ్ళ క్రితమే మూవీ ఇండస్ట్రీలోకి వచ్చిన దీక్ష పంత్ కి అనుకున్న స్థాయిలో పేరు రాలేదు. సైడ్ రోల్స్ చేస్తూ ఉండిపోయింది. కెరీర్ లో బ్రేక్ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఐతే బిగ్ బాస్ సీజన్ 1 లో వైల్డ్ కార్డు ఎంట్రీతో వెళ్లి అదరగొట్టింది. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. టాస్కులు ఆడింది. ఐతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అనుకున్నంత ఆఫర్స్ కూడా ఏమీ రాలేదు. అల్లు అర్జున్ నటించిన వరుడు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రచ్చ, ఒక లైలా కోసం, గోపాల, గోపాల, శంకరాభరణం వంటి మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ చేసింది. బిగ్ బాస్ తో దీక్షకు మంచి పాపులారిటీ వచ్చింది కానీ మూవీ ఆఫర్స్ మాత్రం రాలేదు. ఐతే రీసెంట్ గా ఒక చిట్ చాట్ లో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
" బిగ్ బాస్ తర్వాత నాకు ఆఫర్స్ ఏమీ రాలేదు. బిగ్ బాస్ తర్వాత గ్యాప్ కావాలని ఇవ్వలేదు గ్యాప్ అలా వచ్చేసింది. నాకు కరెక్ట్ ప్రాజెక్ట్స్ అనేవి రాలేదు. నాకు తెలుసు ఇది లాంగ్ బ్రేక్ అని. త్వరలో రైట్ ప్రాజెక్ట్ వస్తే చేస్తాను. బిగ్ బాస్ తర్వాత అందరి కెరీర్ ఎలా ఉందో నాది కూడా అలాగే ఉంది. బిగ్ బాస్ ముందు నేను చాలా బిజీగా ఉండేదాన్ని. నాకు అర్ధం కావట్లేదు బిగ్ బాస్ చూసాక క్యారెక్టర్, బిహేవియర్ , వాయిస్ అన్నీ అలా గుర్తుండిపోతాయని ఎవరూ అప్రోచ్ అవ్వరు. ఏదైనా క్యారక్టర్ కోసం అప్రోచ్ ఐనా ఇది ఆల్రెడీ చూసేసిన ఫేస్ కదా ఆల్రెడీ వినేసిన వాయిస్ కదా అన్న విషయం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పెద్ద ప్రోబ్లం అవుతోంది. అందరి విషయం నాకు తెలీదు. కానీ నేను పర్సనల్ గా ఇది ఫేస్ చేసాను. కుకు విత్ జాతిరత్నాలు షోలో సతాయించి వంటలు చెడగొట్టడానికి వెళ్ళేది. ప్రతీ సీజన్ లో మేము రిపీట్ గా వెళ్ళాలి అంటే వంటలు నేర్చుకోకుండా ఉండాలి " అని చెప్పింది దీక్షా పంత్.
![]() |
![]() |